Posts

Showing posts with the label wedding

పెళ్లిళ్లకి సైకిళ్లపై రావాలట! ! ! wedding cycle

Image
పెళ్లి వూరేగింపు అంటే భాజా భజంత్రీల మధ్య అట్టహాసంగా జరుపుకొంటారందరూ.. పెళ్లి కొడుకుని గుర్రంపైనో, కారులోనో.. ఇలా ఎవరికి వీలైన విధంగా వారు పెళ్లి మండపాలకు తీసుకొస్తారు. ఇక అతిథులైతే ఎవరికి వీలైన విధంగా వారు మండపాలకు చేరుకుంటారు. కానీ ఈ సామూహిక వివాహాలకు మ్రాతం అందరూ సైకిళ్లపై రావాలట.. 258 మంది పెళ్లి కొడుకులు కూడా పెళ్లి జరిగే ప్రదేశానికి సైకిళ్లపై వూరేగింపుగా వస్తారని నిర్వాహకులు చెప్తున్నారు. అతిథులు కూడా వారితో పాటు సైకిళ్లపై వస్తారని, కాలుష్యాన్ని నివారించేందుకు ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. నవంబర్‌ 7న సౌరాష్ట్ర పాటిల్‌ సేవా సమాజ్‌ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు ఏర్పాటు చేశారు. ఈ వివాహాలకు వచ్చే వారు అందరూ సైకిళ్లపై రావాలని వారు పిలుపునిచ్చారు. నిత్యం పెరుగుతున్న ట్రాఫిక్‌ సమస్య, కాలుష్యం గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా సౌరాష్ట్ర పాటిల్‌ సేవా సమాజ్‌ అధ్యక్షుడు మాట్లాడుతూ.. సూరత్‌ 20 స్మార్ట్‌సిటీల్లో ఒకటిగా ఎంపికైన నేపథ్యంలో ప్రజలంతా ట్రాఫిక్‌ సమస్యలు, కాలుష్యం నివారించేందుకు చర్యలు తీసుకోవ...